'స్టార్ మా' సంచలనం.. వందల కోట్ల బిజినెస్ చిత్రాలన్నీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో 'స్టార్ మా' ఒకటి. భారీ అంచనాలు ఉన్న చిత్రాల శాటిలైట్ హక్కులు దక్కించుకోవడంలో స్టార్ మా తర్వాతే ఎవరైనా. 2021, 2022 సంవత్సరాలలో విడుదలయ్యే చిత్రాల విషయంలో స్టార్ మా ప్లానింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
వందల కోట్ల బిజినెస్ చేసే చిత్రాలన్నీ శాటిలైట్ హక్కుల రూపంలో స్టార్ మా బుట్టలోకి చేరిపోయాయి. తాజాగా స్టార్ మా శాటిలైట్ హక్కులు దక్కించుకున్న చిత్రాలని ప్రకటించారు. ఈ జాబితాలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ నుంచి అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరకు క్రేజీ చిత్రాలన్నీస్టార్ మా జాబితాలోనే ఉన్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ తెలుగు శాటిలైట్ హక్కులని స్టార్ మా దక్కించుకుంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప, బాలయ్య అఖండ, రవితేజ ఖిలాడీ, నాని టక్ జగదీష్, నితిన్ మ్యాస్ట్రో, నాగచైతన్య లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట చిత్రాల శాటిలైట్ హక్కులని స్టార్ మా సొంతం చేసుకుంది.
ఆర్ఆర్ఆర్, పుష్ప , అఖండ, సర్కార్ వారి పాట లాంటి చిత్రాల బిజినెస్ వందల కోట్లల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంతటి క్రేజీ చిత్రాలని దక్కించుకుంటుంది కాబట్టే టిఆర్పి రేటింగులలో స్టార్ మా తరచుగా రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments