స్టార్ మా సరికొత్త సీరియల్ 'శ్రీమతి శ్రీనివాస్'
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక కొత్త రకం కథ తో స్టార్ మా అందిస్తున్న ఒక సరికొత్త సీరియల్ "శ్రీమతి శ్రీనివాస్". నిజానికీ అబద్ధానికి మధ్య దూరం ఒక అనుబంధం అనే సున్నితమైన కథాంశంతో స్టార్ మా రూపొందిస్తున్న ఈ ధారావాహిక ఈ నెల 20 న ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది.
అబద్ధం చెప్పాల్సిన పరిస్థితులు, ఆ తరవాత తలెత్తే పర్యవసానాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో చిన్న చిన్న విషయాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పే సీరియల్ ఇది. అబద్ధం ఇష్టం లేని ఒక అమ్మాయికి, అబద్ధం చెప్పాల్సి వచ్చిన ఒక అమ్మాయికి మధ్య మొదలయ్యే కొత్త జీవితం, తరవాత ఆ ఇద్దరి మధ్య ఏర్పడే బంధం ఈ కథలో ప్రధాన విషయాలు.
నిజం బయట పడినప్పటి నుంచి ఇద్దరి జీవితం ఎలా వుంది అనే ప్రశ్నకు సమాధానమే ఈ ధారావాహిక.
"శ్రీమతి శ్రీనివాస్" సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు స్టార్ మా లో.
"శ్రీమతి శ్రీనివాస్" ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Content Produced by: Indian Clicks, LLC
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com