స్పెషల్ సండే .. స్టార్ మా లో...
Send us your feedback to audioarticles@vaarta.com
సండే అంటే వారం రోజుల పని నుంచి రిలాక్సేషన్. సండే అంటే ఫామిలీ తో సరదాగా గడిపే టైం. సండే కోసం అందుకే ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తారు. ఇప్పుడు మరింతగా ఎదురుచూసేలా సండే ని స్టార్ మా మరింత వినోదాత్మకంగా మలిచింది.
ఈ ఆదివారం (ఫిబ్రవరి 14న ) స్టార్ మా తన అభిమాన ప్రేక్షకులకు అద్భుతం అనిపించే స్థాయిలో ఈవెంట్ ని ప్రసారం చేస్తోంది. అదే “బిగ్ బాస్ ఉత్సవం”. జాతీయ స్థాయిలో ప్రేక్షకులను విశేషంగా అలరించిన రియాలిటీ షో “బిగ్ బాస్” ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది స్టార్ మా. దానికి తెలుగు ఆడియన్స్ అపూర్వమైన విజయాన్నిచ్చి ఆశీర్వదించారు. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ అద్భుతమైన విజయాన్ని సాధించాయి. వాటిలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో ప్రేక్షకుల్ని అలరించిన హౌస్ మేట్స్ అందరూ ఒకచోట కలిసి వేడుక చేసుకుంటే.. ? హౌస్ మేట్స్ గా వచ్చి స్టార్స్ అయిన అందరూ ఒకే వేదికపైకి రావడం నిజంగా ప్రేక్షకులకు కన్నుల పండువ కాబోతోంది.
ఆ సంబరం పేరే “బిగ్ బాస్ ఉత్సవం”. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో “బిగ్ బాస్ ఉత్సవం” ప్రసారం కాబోతోంది. ఇక ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల పాటు స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ ప్రామిసింగ్ గా వినోదాన్ని అందించబోతున్నాయి.
సో.. స్టార్ మా లో ఈ సండే అద్భుతమైన వినోదాన్ని మిస్ కావద్దు.
"బిగ్ బాస్ ఉత్సవం" ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments