కష్టకాలంలో మంచి మనసు చాటుకున్న 'స్టార్ మా'

  • IndiaGlitz, [Saturday,May 16 2020]

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ నడుస్తు్న్న విషయం విదితమే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే.. వలస కార్మికులు, సినిమానే నమ్ముకుని బతుకుతున్న దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా సినిమా షూటింగ్స్ లేక టెక్నిషియన్స్ అనగా సాంకేతిక, సాంకేతికేతర విభాగాల్లో పనిచేసే వారు ఇక్కట్లు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకుంటున్నాయి.

‘మా’.. మంచి మనసు!

ఇలాగే తమ వంతుగా సాయం చేయడానికి తెలుగు ప్రేక్షకుల అభిమానంతో మొదటి స్థానంలో దూసుకుపోతున్న ‘స్టార్ మా’ ముందుకొచ్చింది. లాక్ డౌన్‌తో పనుల్లేక ఆదాయం లేక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారిపై దృష్టిసారించి సాంకేతిక, సాంకేతికేతర విభాగాల్లో పనిచేసే 500 మందికి పైగా నిపుణుల సంక్షేమం కోసం రూ. 55 లక్షలు విరాళంగా ఇచ్చి దాతృత్వం చాటుకుంది. ఈ సాయం పొందిన వారిలో ఆర్ట్ అసిస్టెంట్, ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేవారు, కళాకారుల సహాయకులు, ఫ్రీలాన్సర్స్, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఈ ఆర్థిక సాయాన్ని ‘స్టార్ మా’ యాజమాన్యం అందజేసింది. మొత్తం ఇలా 500 మందికి పైగా ఒక్కొక్కరి 10,000 రూపాయిలు అందజేసింది. ఇలా సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని.. ‘స్టార్ మా’ తమ కోసం ఇలా సాయం చేసి మంచి మనసు చాటుకుందని వారు చెబుతున్నారు.

‘మా’ సాయం గొప్పదే..!

కాగా.. ఒక్కొక్కరికి పదివేలు.. అలా 500 మందికి పైగా ‘స్టార్ మా’ ఇచ్చిందంటే నిజంగా చాలా గ్రేటే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పట్లో జీతాలు ఇవ్వడమే కష్టం అనుకుంటుంటే.. మరోవైపు ఉన్న జీతాలు సైతం కట్ చేసి ఇస్తున్న తరుణంలో మా మాత్రం పనిలేకపోయినా.. మంచి రోజులొస్తే తర్వాత చూద్దాం లే అని పెద్ద మనసు చేసుకుని మరీ ఆర్థిక సాయం చేసి ఆదుకోవడం మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు. కష్టకాలంలో తోటి వ్యక్తికి సాయం చేస్తే.. మన దగ్గర ఉన్నంతలో కాస్తో కూస్తో సాయం చేస్తే అవతలి వ్యక్తికి కడుపు నింపినవారమవుతాం. సో.. సాయం చేసి మంచి మనసు చాటుకోండి.

More News

ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు.. 101 మంది డిశ్చార్జ్

ఆంధ్రప్రదేశ్‌ కరోనా థాటి నుంచి కాస్త కోలుకున్నట్లే అనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే.. వారంరోజులుగా నమోదైన కేసులు చాలా కుదుటపడుతోందనే చెప్పుకోవచ్చు.

టాలీవుడ్ షూటింగ్స్, షోలు ప్రారంభమైతే ఇలా చేయాల్సిందే!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్, హాలీవుడ్ వరకూ ఎక్కడా సినిమా షూటింగ్స్ జరగట్లేదు. అంతేకాదు.. థియేటర్స్, సినిమా రిలీజ్‌లు కూడా జరగట్లేదు..

నువ్ ఎవడివి నన్ను అడగడానికి.. అనసూయ ఆగ్రహం!

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్

యంగ్ డైరెక్టర్ దుర్మరణం.. విషాదంలో శంకర్!

సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి భయం.. మరోవైపు ఇలా వరుస విషాదాలతో ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పలువురు

ఏపీలో త్వరలో తెరుచుకోనున్న ప్రధాన దేవాలయాలు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నది. ఇప్పటి వరకూ 3.0 లాక్‌డౌన్లు పూర్తి కాగా రేపో ఎల్లుండో మరోసారి పొడిగింపు