అక్కా చెల్లెలుగా స్టార్ హీరోయిన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ముందు వరుసలో ఉన్నది సమంత అక్కినేని... అప్కమింగ్ లిస్టులో స్టార్ హీరో్యిన్గా రష్మిక మందన్నా మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. సాధారణంగా వీరి మధ్య పోటీ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఇద్దరి మధ్య పోటీ కంటే ఒకరికొకరు సాయపడే తత్వం ఎక్కువగా ఉందని అర్థమవుతుంది ఓ వార్త వింటుంటే. ఇంతకూ అదేం వార్త అని అనుకుంటున్నారా? వివరాల్లోకెళ్తే.. ఓ బేబీ తర్వాత సమంత అక్కినేని మరో సినిమాలో నటించడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు లేదు. కథలు మాత్రం వింటుంది.
రీసెంట్గా ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన పాత్ర సమంతకు బాగా నచ్చింది. ఇది అక్కా చెల్లెలకు సంబంధించిన సినిమా. ఇందులో అక్క పాత్ర కోసం నటించమని అడగటానికి సమంతను సదరు దర్శకుడు సంప్రదించాడట. కథ విన్న సమంత సినిమా చేయడానికి ఓకే చెప్పడమే కాకుండా చెల్లెలు పాత్రలో రష్మిక మందన్నా నటిస్తే బావుంటుందని సలహా ఇచ్చిందట. దర్శకుడు కూడా రష్మిక మందన్నాను కలిసి ఇలా సమంత రెఫరెన్స్ మీద వచ్చానని కథ చెప్పాడట. కథ నచ్చడమే కాదు.. సమంత రెఫరెన్స్ కావడంతో ఆమె కూడా నటిస్తానని చెప్పిందట. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com