అక్కా చెల్లెలుగా స్టార్ హీరోయిన్స్‌

  • IndiaGlitz, [Saturday,August 08 2020]

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ముందు వ‌రుస‌లో ఉన్న‌ది స‌మంత అక్కినేని... అప్‌క‌మింగ్ లిస్టులో స్టార్ హీరో్యిన్‌గా ర‌ష్మిక మంద‌న్నా మంచి అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటోంది. సాధార‌ణంగా వీరి మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తారు. కానీ ఇద్ద‌రి మ‌ధ్య పోటీ కంటే ఒకరికొక‌రు సాయ‌ప‌డే త‌త్వం ఎక్కువ‌గా ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది ఓ వార్త వింటుంటే. ఇంత‌కూ అదేం వార్త అని అనుకుంటున్నారా? వివ‌రాల్లోకెళ్తే.. ఓ బేబీ త‌ర్వాత స‌మంత అక్కినేని మ‌రో సినిమాలో న‌టించ‌డానికి ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు లేదు. క‌థ‌లు మాత్రం వింటుంది.

రీసెంట్‌గా ఓ యంగ్ డైరెక్ట‌ర్ చెప్పిన పాత్ర స‌మంత‌కు బాగా న‌చ్చింది. ఇది అక్కా చెల్లెల‌కు సంబంధించిన సినిమా. ఇందులో అక్క పాత్ర కోసం న‌టించ‌మ‌ని అడ‌గ‌టానికి స‌మంత‌ను స‌ద‌రు ద‌ర్శ‌కుడు సంప్ర‌దించాడ‌ట‌. క‌థ విన్న స‌మంత సినిమా చేయ‌డానికి ఓకే చెప్ప‌డ‌మే కాకుండా చెల్లెలు పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తే బావుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చింద‌ట‌. ద‌ర్శ‌కుడు కూడా ర‌ష్మిక మంద‌న్నాను క‌లిసి ఇలా స‌మంత రెఫరెన్స్ మీద వ‌చ్చాన‌ని క‌థ చెప్పాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డ‌మే కాదు.. స‌మంత రెఫ‌రెన్స్ కావ‌డంతో ఆమె కూడా న‌టిస్తాన‌ని చెప్పింద‌ట‌. మ‌రి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

More News

ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో సాయితేజ్ కొత్త చిత్రం...?

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్.

శృతిహాస‌న్ చూపిస్తానంటున్న ‘ఎడ్జ్‌’

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్.

డైరెక్ట‌ర్‌గా మారుతున్న ఆర్ట్ డైరెక్ట‌ర్‌..?

సినిమా రంగంలోకి అడుగు పెట్టేవారికి ఒక్కొక్క‌రికీ ఒక్కో క‌ల ఉంటుంది.

గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. 12న అందుబాటులోకి వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలన్నీ పోటాపోటీగా పని చేస్తున్నాయి.

బ్రేకింగ్: కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ప్రముఖ రాజకీయ నేతలు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.