నెర్వస్ గా ఫీలైన స్టార్ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ఇప్పుడు తమిళ చిత్రం `విఐపి2`. ఈ చిత్రంలో కాజోల్ వసుంధర అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ పాత్రలో కనపడుతుంది. ఈ పాత్ర చేయడానికి ముందు కాజోల్ చాలానే ఆలోచించిందట. నెర్వెస్‌గా ఫీలైందట. కానీ ధనుష్, సౌందర్య అసలు సినిమాలో పెద్ద డైలాగ్స్ ఉండవనీ అన్నారట. సరేనని ఒప్పుకుందట.
దనుష్, సౌందర్య మంచివారనుకున్నా కానీ వారు అనుకున్నంత మంచివారు కాదని కాజోల్ అంది(నవ్వుతూ). ఎందుకంటే తొలి రోజునే రెండు సీన్స్ డైలాగ్స్‌ను పెద్ద స్క్రిప్ట్ రూపంలో ఇచ్చారట. ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ని కూడా ప్రత్యేకంగా నియమించి డైలాగ్స్ నేర్పించారట. ప్రతిరోజు షూటింగ్ అయిపోగానే మరుసటి రోజు డైలాగ్స్‌ను కాజోల్ ప్రాక్టీస్ చేసిందట. దనుష్, సౌందర్యల వల్లే తాను భాష సరిహద్దులను దాటేశానని చెప్పుకొచ్చింది. ఇరవై యేళ్ళ క్రితం మెరుపు కలలు తర్వాత కాజోల్ నటించిన దక్షిణాది చిత్రం `విఐపి 2`. తెలుగు, తమిళం, హిందీల్లో జూలై 14న విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com