ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా..: స్టార్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ తన మనసులోని మాటను బయటపెట్టింది. అంతేకాదు.. దగ్గుబాటి రానా అంటే ఇష్టమే కానీ.. ప్రభాస్‌ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని చందమామ బ్యూటీ చెప్పుకొచ్చింది. ‘ఫిట్ అఫ్ విత్ స్టార్స్’ అనే షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పై విషయాలను చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీకి సంబంధించి పలు ప్రశ్నలు ఎదురవ్వగా చాలా లాజిక్‌గా బ్యూటీ సమాధానాలిచ్చింది.
ఛాన్స్ వస్తే రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్‌లో ఎవరిని చంపుతావు? ఎవరితో లేచిపోతావు? ఎవరిని పెళ్లి చేసుకొంటావు? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘రాంచరణ్‌ను చంపేస్తాను. జూనియర్ ఎన్టీఆర్‌తో లేచిపోతాను.. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి అయింది. ఇక ప్రభాస్‌కు పెళ్లి కాలేదు కాబట్టి ఆయన్ను పెళ్లి చేసుకొంటాను’ అని తన మనసులోని మాటను కాజల్ బయటపెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments