పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్!
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే ఇదేంటి..? పెళ్లి కాకుండానే తల్లికావడం ఎలా సాధ్యం..? ఓహ్ సినిమాలో ఇలా నటిస్తోందా..? అని అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది రియల్ లైఫ్లో జరిగిందే.. తాను ప్రెగ్నెన్సీ అని స్వయానా ఆ స్టార్ హీరోయినే ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేసింది. అంతేకాదు ఎక్కడ నమ్ముతారో నమ్మరో అని ఓ ఫొటోను కూడా అభిమానులు, సినీ ప్రియులతో షేర్ చేసుకుంది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేగా మీ సందేహం..! ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదండోయ్.. అందాల తార అమీ జాక్సన్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గత ఏడాది విడుదలైన ‘రోబో 2.0’ హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈమె తెలుగుతో పాటు పలు బాషల్లో నటించింది తక్కువ సినిమాలే అయిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం ఈ భామకు బ్రిటన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో నిశ్చితార్థం అయ్యింది. ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే నిశ్చితార్థానికి ముందే అమీ-జార్జ్ ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. దీంతో ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పింది.
వేయి కళ్లతో వేచి చూస్తున్నా..
"మీ అందరికీ ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని వేచిచూస్తున్నాను. మదర్స్ డే కి (బ్రిటన్లో ఈరోజు మదర్స్ డే) మించిన సరైన రోజు మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను (పుట్టబోయే బేబీని ఉద్దేశిస్తూ) ప్రేమిస్తున్నాను. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని వెయ్యి కళ్లతో (కాబోయ్ భర్త- అమీ) ఎదురుచూస్తున్నాం" అని తన ఇన్స్టాగ్రామ్లో అమీ స్పష్టం చేసింది. అంతేకాదు.. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు, పలువురు ప్రముఖులు అమీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ కామెంట్లు చూసిన అందాల భామ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com