ముసలమ్మ పాత్రలో స్టార్ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను కంగనా రనౌత్ నిర్మిస్తూ నటిస్తుండటం విశేషం. భారత స్వాతంత్ర పోరాటం కోసం పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుంది.
ఈ సినిమా తర్వాత తాను సినిమాల్లో నటించనని చెప్పిన కంగనారనౌత్ దర్శకత్వం చేయాలనుకుంటున్నానని చాలా రోజుల క్రిందటే చెప్పింది. ఇప్పుడు అందుకు కంగనా రంగం సిద్ధం చేసుకుంటుంది. `తేజు` అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను కంగనా రనౌత్ డైరెక్ట్ చేయడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించనుంది. డిసెంబర్లో సినిమా ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com