అందరికీ సమ ప్రాధాన్యత ఉంటుంది - అనీషా అంబ్రోస్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు, ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు, సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి మేటి దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం 'లేడీస్ టైలర్' అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఆ పాత మధురం 'లేడీస్ టైలర్' సినిమాకి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి. 'లేడీస్ టైలర్' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన లెజెండరీ డైరెక్టర్ వంశీనే, ఈ సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జూన్ 2న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ అనీషా అంబ్రోస్‌తో ఇంటర్వ్యూ...
క్యారెక్టర్ గురించి...
ఫారిన్ నుంచి విలేజ్‌కి వచ్చిన అమ్మాయిగా నటించాను. విలేజ్ వాతావరణం, చీర కట్టుకోవడం వంటివన్నీ ఇష్టపడే అమ్మాయిగా నటించాను. శారీ కట్టుకోవడం, విలేజ్ కల్చర్ వంటివి తెలియకపోయినా, వాటిని చూసి ముచ్చటపడుతుంది. ఆ మొత్తం ప్రాసెస్ చాలా బాగా ఉంటుంది. అంటే నా గత చిత్రాల్లో చాలా సింపుల్‌గా చేశాను. కానీ ఈ సినిమాలో రొమాన్స్ ఉంటుంది. ఇంకా కాస్ట్యూమ్స్ లో కూడా షాట్స్ వంటివి వేసుకున్నా. అవన్నీ ఇందులో డిఫరెంట్‌గా అనిపిస్తాయి.
పెద్ద వంశీగారి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్...
పెద్ద వంశీగారితో పనిచేయడం నా అదృష్టం. ముగ్గురు హీరోయిన్లు ఉన్న మాట వాస్తవమే. కానీ అందరికీ సమ ప్రాధాన్యతను ఇచ్చారు.
హీరో సుమంత్ గురించి...
ఒక ఫ్రెండ్‌తో కలిసి చేస్తున్నట్టు అనిపించింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. లేడీస్ టైలర్ సినిమా చూశాను. కానీ ఆ సినిమాకూ, దీనికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సీక్వెల్ కాబట్టి ఆ మార్పును అందరూ గమనిస్తారు. లేడీస్ టైలర్‌కి ఒక కొడుకుంటే.. అతనేం చేస్తుంటాడు అని సినిమా చేశాం.
మధురశ్రీధర్గారు మంచి భరోసానిస్తారు...
మధుర శ్రీధర్‌గారు నటీనటుల్ని చాలా బాగా చూసుకుంటారు. వ్యక్తిగత సమస్యలను కూడా చెప్పుకోగల చనువు ఉంటుంది ఆయనతో. ఆ భరోసాతో ఆయనతో పది సినిమాలు కూడా చేయొచ్చు.
తదుపరి చిత్రాలు...
మనోజ్‌తో చేస్తున్నాను. ఆ సినిమా రన్నింగ్‌లో ఉంది. కొత్త కమిట్మెంట్స్ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు చెప్పలేను. అలాగే తమిళంలో కూడా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా గురించి వివరాలు తెలియజేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments