పెళ్లి తర్వాతే పిల్లలంటున్న స్టార్ హీరోయిన్
- IndiaGlitz, [Monday,February 10 2020]
హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలని చాలా ప్రయత్నాలే చేసింది. అయితే కెరీర్ ప్రారంభంలో తాప్పీకి లక్ కలిసి రాలేదు. అయితే బాలీవుడ్ ఎంట్రీ తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది. వరుసగా బాలీవుడ్‌లో సక్సెస్‌లు సాధించడం.. అదే సమయంలో ఆమె తెలుగు, తమిళంలో చేసిన చిత్రాలు సక్సెస్ కావడంతో తాప్సీ ఇమేజ్ పెరిగింది. ప్రస్తుతం ఈ సొట్టబుగ్గల సొగసరి మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్ శభాష్ మిత్తులో టైటిల్ పాత్రలో నటిస్తుంది.
రీసెంట్‌గా ఓ సందర్భంలో తన పెళ్లి గురించి, ప్రేమికుడి గురించి తాప్సీ మాట్లాడుతూ ‘’నేను పెళ్లి చేసుకోవాలనుకుంటోన్న వ్యక్తి సినిమా వ్యక్తో, క్రికెటరో కాడు. ప్రస్తుతం అతను నాకు చాలాదూరంగా కూడా ఉన్నాడు. అతన్ని ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాను? ఎప్పుడు పిల్లల్ని కంటాను? అన్నది పూర్తిగా నా వ్యక్తిగతం. వాటి గురించి అందరితో డిస్కస్ చేయలేను. ఈ విషయంలో మా పేరెంట్స్‌తో మాత్రమే మాట్లాడతాను. పెళ్ళి తరువాతే పిల్లల్ని కంటాను. పెళ్ళికాకుండా పిల్లల్ని కనడం నాకు ఇష్టముండదు. మళ్ళీ అలా కంటున్నవారున్నారు కదా? వారిని విమర్శిస్తున్నారా? అని మాత్రం అడగకండి. దీని మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్పాను’’ అని తన పెళ్లి గురించి తెలివిగా మాట్లాడేసింది మరి.