ప్రభాస్-నాగీ మూవీలో స్టార్ హీరోయిన్!
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. అయితే ఈ కాంబోలో సినిమా ఎలా ఉంటుంది..? కథ ఎలా ఉండబోతోంది..? అనేదానిపై ఇటు టాలీవుడ్లో.. అటు సోషల్ మీడియా.. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది.
మరో వైపు ప్రభాస్ సరిపడే.. డార్లింగ్‌తో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరబ్బా..? టాలీవుడ్ నుంచే తీసుకుంటారా..? లేకుంటే ‘సాహో’కు పట్టుకొచ్చినట్లుగానే బాలీవుడ్ భామనే పట్టుకొస్తారా..? అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సినిమా ప్రకటించిన కొన్ని గంటల నుంచే ఇదిగో ఇలా స్టోరీ ఉంటుందట.. ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను కొల్లగొట్టే దిశగా అడుగులు పడుతున్నాయ్..? ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్లు రాసేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగుచూసింది. అదేమిటంటే.. ప్రభాస్ సరసన నటించే భామ ఎవరు అనేది దాదాపుగా తెలిసిపోయింది.
ఆ అందాల భామ ఎవరంటే...!
ఆ బ్యూటీ మన తెలుగు, కోలీవుడ్ నుంచి.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా కాదండోయ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల తార దీపికా పదుకొనే.. ప్రభాస్ సరసన నటించనుందట. ఈ మేరకు ఇటీవలే ఆమె మేనేజర్‌ను సంప్రదించి అపాయిట్మెంట్ తీసుకున్న నాగీ.. కథ వినిపించాడట. సరే.. నేను నటించడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పిందట. ఒకవేళ ఇదే నిజమైతే దీపికా నటించే తెలుగు సినిమా ఇదే అవుతుంది. అంతేకాదు.. దీపికా చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది.. అలా అనుకుంటున్న దీపికాను అదృష్టం ఇంటి తలుపుతట్టినట్లే. కాగా దీపికానే ప్రభాస్ నటిస్తుందంటే.. డార్లింగ్ సరసన నటించే మూడో బాలీవుడ్ బ్యూటీ అవుతుంది. ఇదివరకే ‘సాహో’లో హీరోయిన్గా శ్రద్ధాను తీసుకోగా.. సాంగ్‌లో జాక్వలిస్ పెర్నాడ్జ్ను కూడా తీసుకున్నారు. వీరిద్దరు కాగా.. దీపికా నటిస్తే ముగ్గురవుతారన్న మాట. మరి ఇందులో నిజానిజాలెంతో..? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments