తనయులు ప్లస్ స్టార్ హీరోలు
Send us your feedback to audioarticles@vaarta.com
దసరా పండక్కి రెండు భారీ చిత్రాలు వారం రోజుల గ్యాప్‌లో రానుండడమే తెలుగు ప్రేక్షకులకి మహదానందమైతే.. ఇద్దరు అగ్ర నాయకులు చెరో సినిమాలో తళుక్కున మెరవడం మరింత ఎంటర్టైన్మెంట్ పెంచినట్లవుతోంది. కాస్త వివరాల్లోకి వెళితే.. ఈ నెల 16న 'బ్రూస్ లీ' చిత్రం విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారు. సినిమా క్లైమాక్స్ సీన్స్‌లో చిరు మెరుపులా మెరుస్తారట. దాదాపు 6 ఏళ్ల తరువాత చిరంజీవి నటిస్తున్న సినిమా తన తనయుడిదే కావడం విశేషం.
ఇక ఈ నెల 22న రానున్న 'అఖిల్' సినిమా ద్వారా అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులోనూ ఓ స్టార్ హీరో తళుక్కున మెరవనున్నాడు. అతను మరెవరో కాదు అఖిల్ తండ్రి, కింగ్ నాగార్జున. 'అక్కినేని అక్కినేని' పాటలో చైతుతో పాటు నాగ్ కూడా మెరుపులా మెరవనున్నారు. తనయులను సపోర్ట్ చేస్తూ స్టార్ హీరోలు వారం గ్యాప్‌లో సందడి చేయనున్న ఈ సినిమాలు ఏ మేరకు అభిమానులను అలరిస్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments