గిల్డ్ చొరవ తప్పిన స్టార్ హీరోల బాక్సాఫీస్ పోరు
Send us your feedback to audioarticles@vaarta.com
నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పడిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమాల రిలీజ్‌ల విషయంలో నిర్మాతలకు తన వంతు సహకారాన్ని అందిస్తుంది. గిల్డ్ చొరవ తీసుకోవడంతో ఇద్దరు స్టార్ హీరోలకు బాక్సాఫీస్ పోరు తప్పింది. సూపర్‌స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` , స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ `అల...వైకుంఠపురములో...` సినిమాలను రానున్న సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తామని ఇద్దరు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీ స్ వద్ద పోటీ పడితే ఇద్దరు నిర్మాతల్లో ఒకరు నష్టపోవడం తప్పదు. దీంతో గిల్డ్ చొరవ తీసుకుని వారితో చర్చలు జరిపింది. దీంతో నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ, అనిల్ సుంకర రిలీజ్ డేట్స్ విషయంలో సయోధ్య కుదుర్చుకున్నారు.
ఇటీవల నానిస్ గ్యాంగ్‌లీడర్, గద్దలకొండ గణేష్ సినిమాల రిలీజ్ విషయంలో క్లాష్ రాకుండా కీలక పాత్ర పోషించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్.... సూపర్‌స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `అల..వైకుంఠపురములో..` సినిమా రిలీజ్ డేట్స్ క్లాష్ రాకుండా మరోసారి కీలక పాత్ర పోషించింది. రెండు చిత్రాల నిర్మాతలు అనిల్ సుంకర, ఎస్.రాధాకృష్ణలతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ చర్చలు జరిపింది. చర్చల అనంతరం సూపర్ స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` చిత్రం జనవరి 11న విడులవుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ` అల..వైకుంఠపురములో..` జనవరి 12న విడుదలవుతుంది.
ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఓకే రోజు విడుదలైతే నిర్మాతలకు కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని ఇద్దరు నిర్మాతలు ప్రొడ్యూసర్ గిల్డ్ చర్చలు జరిపిందని, నిర్మాతలు వారి సినిమాల విడుదల తేదీల విషయంలో సానుకూలంగా స్పందించారు. వారికి మా గిల్డ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని గిల్డ్ సభ్యులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com