అభిమాని చెప్పులు తాకిన స్టార్ హీరో..!

  • IndiaGlitz, [Saturday,September 26 2020]

హీరోలంటే సాధార‌ణ ప్రేక్ష‌కుల్లో ఓ క్రేజ్ ఉంటుంద‌నండంలో సందేహం లేదు. ఇక అగ్ర హీరోల గురించి, వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే స్టార్ హీరోలు ఎక్కువ‌గా బ‌య‌ట‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అందుకు కార‌ణం వారిని క‌లుసుకోవ‌డానికి అభిమానులు అత్యుత్సాహం చూపుతారు. రీసెంట్‌గా గాన గంధ‌ర్వుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు నివాళి అర్పించ‌డానికి కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రైన విజ‌య్ వ‌చ్చారు. కార్య‌క్ర‌మం అయిపోయే వర‌కు ఉన్నారు. విజ‌య్ కార్య‌క్ర‌మం నుండి వెళ్లిపోయే స‌మ‌యంలో ఆయ‌న్ని కలుసుకోవ‌డానికి అభిమానులు అమితాస‌క్తి చూపారు. తోపులాట జ‌రిగింది.

అయితే పోలీసులు విజ‌య్‌ను కారు వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లే క్ర‌మంలో విజ‌య్ అక్క‌డ ప‌డిఉన్న ఓ చెప్పు తీసి స‌ద‌రు అభిమానికి అందించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఓ అగ్ర హీరో అయ్యుండి ఓ అభిమాని చెప్పు తాక‌డం చాలా గొప్ప విష‌య‌మ‌ని త‌మిళ మీడియా విజ‌య్‌ను ఆకాశానికెత్తేస్తుంది. విజ‌య్ హీరోగా చేసిన మాస్ట‌ర్ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రో వైపు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌డానికి విజ‌య్ సిద్ధ‌మ‌వుతున్నారు.

More News

నేష‌న‌ల్ మీడియాపై హ‌రీశ్ శంక‌ర్ సెటైర్ !

టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ నేష‌న‌ల్ మీడియాపై త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు.

త‌న విగ్ర‌హాన్ని తానే త‌యారు చేయించుకున్న బాలు...!

గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. ఐదు దశాబ్దాలు.. 12 భాష‌ల్లో 40వేల‌కు పైగా పాట‌లు...

డ్రగ్స్ చాట్ చేసినట్టు అంగీకరించిన రకుల్..!

డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు శుక్రవారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాజరైన విషయం తెలిసిందే.

నిశ్శ‌బ్ధం కోసం అనుష్క ఇంట‌ర్నేష‌న్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు - డైరెక్ట‌ర్ హేమంత మ‌ధుక‌ర్

పుష్ప‌క విమానం టైపులో ప్ర‌స్తుత సాంకేతిక‌ను వాడుకొని థిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ఎక్స్ పెర్మెంటల్ మూవీ చేయాల‌నుకున్నా.

'దిశ ఎన్కౌంటర్' ట్రైలర్ విడుదల

గతేడాది హైదరాబాద్ శివార్లలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "దిశ ఎన్కౌంటర్".