తాత కాబోతున్న స్టార్ హీరో!!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు ఇప్పటికే తాతయ్యల లిస్టులో చేరిపోయారు. విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున ఈ లిస్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మరో స్టార్ హీరో కూడా చేరబోతున్నారని సినీ వర్గాల సమాచారం. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా? చియాన్ విక్రమ్. ఇటు తెలుగు ప్రేక్షకులకే కాదు.. అటు తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హీరో విక్రమ్. విలక్షణమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుండే విక్రమ్ 2017 తన కుమార్తె అక్షితకు రంజిత్‌తో వివాహం చేశారు. ఇప్పుడు ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కానున్నారట. అంటే విక్రమ్ తాతగా ప్రమోషన్ పొందబోతున్నట్లేగా అని వార్తలు వినిపిస్తున్నాయి.
మరో వైపు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నిలబడటానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మలో హీరోగా నటించాడు ధృవ్. గత ఏడాది విడుదలైన ఆదిత్య వర్మ బాక్సాపీస్ వద్ద చతికిలబడింది. ఇప్పుడు తండ్రితో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు ధృవ్. ఈ విషయంపై అధికారిక సమాచారం రాలేదు కానీ.. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి సినిమా చేయబోయేది మాత్రం నిజమేనని అంటున్నాయి సినీ వర్గాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com