తన కొడుకుకి నామకరణం చేసిన స్టార్ హీరో.. బ్యూటిఫుల్ పిక్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడు శివకార్తికేయన్ తమిళ స్టార్ హీరోల్లో ఒకరు. వరుస విజయాలతో శివకార్తికేయన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల శివకార్తికేయన్ ఫ్యామిలిలో పండుగ లాంటి విశేషం చోటు చేసుకుంది.
శివకార్తికేయన్ మరోసారి తండ్రి అయ్యాడు. శివకార్తికేయన్, ఆయన సతీమణి ఆర్తి దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. గత నెల జూలై 12నే ఈ విశేషం చోటు చేసుకుంది. తాజాగా శివకార్తికేయన్ సోషల్ మీడియా ద్వారా తన ముద్దుల కొడుకుని అభిమానులకు పరిచయం చేశాడు.
తన కొడుకుని ముద్దాడుతూ ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ ఆ మారింది. అభిమానులందరి ఆశీస్సులతో తన కొడుక్కి 'గుగన్ దాస్' అని నామకరణం చేసినట్లు శివకార్తికేయన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా సెలెబ్రిటీలు కూడా శివకార్తికేయన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
శివకార్తికేయన్, ఆర్తి దంపతులు 2010లో వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరిద్దరికి 8 ఏళ్ల కుమార్తె ఉంది. తాజాగా జన్మించిన మగబిడ్డతో శివకార్తికేయన్ ఫ్యామిలీ సంపూర్ణం అయినట్లు అయింది.
ఇదిలా ఉండగా శివకార్తికేయన్ ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తున్నాడు. త్వరలో శివకార్తికేయన్ తెలుగులో డెబ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కు ఈ తమిళ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments