జగన్‌‌తో స్టార్ హీరో మామ భేటీ.. త్వరలో వైసీపీలోకి!

  • IndiaGlitz, [Monday,February 18 2019]

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. టికెట్లు రావని అసంతృప్తితో ఉన్న సిట్టింగ్‌‌లు, ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్‌‌ అటు అధికార.. ఇటు ప్రతిపక్షపార్టీలో చేరుతున్నారు. ఫిబ్రవరి నెలలో పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే.

తాజాగా.. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు (లక్ష్మీ ప్రణతి తండ్రి) వైసీపీ అధినేత వైఎస్‌‌ జగన్‌‌ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం లోటస్‌‌పాండ్‌‌కు వెళ్లిన నార్నె.. సుమారు గంటపాటు జగన్‌‌తో పలు విషయాలు చర్చించారు. ఏపీలోని రాజకీయ అంశాలపై ఇరువురూ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఎన్నికు దగ్గరపడుతున్న టైమ్‌‌లో, వైసీపీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న తరుణంలో ఎన్టీఆర్ మామ.. జగన్‌‌తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. కేవలం మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిశాను. జగన్‌తో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనను కలిశాను అని చెప్పుకొచ్చారు. కాగా.. గత ఎన్నికల్లోనే ఆయన వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో టికెట్ కూడా అడిగారని వార్తలు వినవచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి జగన్‌‌ను కలవడం తెలుగు రాష్ట్రాల్లో, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

మొత్తానికి చూస్తే ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరితే ఎన్టీఆర్.. టీడీపీకి సపోర్ట్ చేస్తారా..? మామ తరఫున వైసీపీకి ప్రచారం చేస్తారా..? లేకుంటే సొంత అక్క ఎన్నికల్లో నిలబడితేనే ప్రచారం చేయని జూనియర్.. రేపొద్దున ఎన్నికల్లో కూడా ప్రచారం చేయకుండా మిన్నకుండిపోతారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

నాని, విక్రమ్‌ కె.కుమార్‌ చిత్రం ప్రారంభం

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8 చిత్రం

రేయ్.. ఫోన్ చేయ్ నీకు ఆన్సర్ చెబుతా.. నాగబాబు వార్నింగ్

అవును మీరు వింటున్నది నిజమే.. ఓ ఇంటర్వ్యూ వేదికగా జనసేనాని బ్రదర్ నాగబాబు.. వైసీపీ నేతకు వార్నింగ్ ఇచ్చారు. లైవ్‌‌లో ఆయన ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..? ఎవరికి వార్నింగ్ ఇచ్చారు..?

ఉగ్రమూకల పై భారత్ ఫస్ట్ రివెంజ్

పుల్వామా ఘటన అనంతరం ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ బలగాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల నుంచే ఉగ్రమూకలు

రాజీనామా చేసి వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌‌లు తగులుతున్నాయి. ఒక్క రోజు గ్యాప్‌‌లోనే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడుతుండటంతో అసలేం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

వీర జవాన్ల కుటుంబాలకు 'మా' వంతు సాయం

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారతదేశంలోని పలువురు ప్రముఖలు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, పౌరులు, హీరోలు పెద్ద మనసుతో తమవంతుగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.