డైరెక్టర్‌కు డెడ్ లైన్ పెట్టిన స్టార్ హీరో?
- IndiaGlitz, [Friday,February 01 2019]
మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. దక్షిణాది భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాను రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని నిర్మాత రాంచరణ్ అనుకున్నాడు. కానీ సినిమా అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి కాలేదు. దాంతో సినిమాను దసరాకు పోస్ట్ పోన్ చేశాడు.
అయితే అప్పటి కూడా విడుదల కాకపోతే కష్టమని భావించాడేమో కానీ సురేందర్ రెడ్డికి.. ఈ చిత్రాన్ని మార్చికంతా షూటింగ్ పూర్తి చేయాలని.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి సెప్టెంబర్కంతా ఆ పనులను పూర్తి చేయాలని గట్టిగా సూచించాడట. మరి సురేందర్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి...