విల‌న్‌కి ఖ‌రీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో

  • IndiaGlitz, [Wednesday,January 08 2020]

బాలీవుడ్‌స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ త‌క్కువ మందితోనే క‌లివిడిగా ఉంటాడు. అయితే త‌న మ‌న‌సుకు ఏ మాత్రం ద‌గ్గ‌రైనా వారిని అంత సుల‌భంగా వ‌దులుకోడు. తాజాగా స‌ల్మాన్ హృద‌యానికి ఓ స్నేహితుడు ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ స్నేహితుడు ద‌క్షిణాది హీరో కావ‌డం విశేషం. దాంతో ఆ స్నేహితుడికి మ‌ర‌చిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చిన త‌న స్నేహాన్ని చాటుకున్నాడు స‌ల్మాన్‌ఖాన్‌. ఇంత‌కు స‌ల్మాన్‌కు ద‌గ్గ‌రైన స్నేహితుడు ఎవ‌రో కాదు.. కన్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌. రీసెంట్‌గా విడుద‌లైన స‌ల్మాన్‌ఖాన్ ద‌బాంగ్ 3 సినిమాలో విల‌న్‌గా న‌టించాడు ఈ క‌న్న‌డ స్టార్‌. ఆ స‌మ‌యంలో సల్మాన్‌తో మంచి స్నేహం ఏర్ప‌డింది.

సినిమా విడుద‌లై 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సినిమాను సాధించింది. ఈ సంద‌ర్భంగా కిచ్చాసుదీప్‌ను స‌ల్మాన్‌ఖాన్ ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నాడు. అంతే కాదండోయ్ ఖ‌రీదైన బీఎండ‌బ్ల్యూ కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు స‌ల్మాన్‌. ఈ విషయాన్ని స్వ‌యంగా సుదీప్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ స‌ల్మాన్‌ఖాన్ బ‌హుక‌రించిన ఖ‌రీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్ ద‌బాంగ్ 3 ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కుతుంది. త‌దుప‌రి చిత్రం రాధేను కూడా ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలోనే స‌ల్మాన్ చేస్తున్నాడు. దీని త‌ర్వాత క‌బీర్‌ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడీ కండల వీరుడు.