విల‌న్‌కి ఖ‌రీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో

  • IndiaGlitz, [Wednesday,January 08 2020]

బాలీవుడ్‌స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ త‌క్కువ మందితోనే క‌లివిడిగా ఉంటాడు. అయితే త‌న మ‌న‌సుకు ఏ మాత్రం ద‌గ్గ‌రైనా వారిని అంత సుల‌భంగా వ‌దులుకోడు. తాజాగా స‌ల్మాన్ హృద‌యానికి ఓ స్నేహితుడు ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ స్నేహితుడు ద‌క్షిణాది హీరో కావ‌డం విశేషం. దాంతో ఆ స్నేహితుడికి మ‌ర‌చిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చిన త‌న స్నేహాన్ని చాటుకున్నాడు స‌ల్మాన్‌ఖాన్‌. ఇంత‌కు స‌ల్మాన్‌కు ద‌గ్గ‌రైన స్నేహితుడు ఎవ‌రో కాదు.. కన్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌. రీసెంట్‌గా విడుద‌లైన స‌ల్మాన్‌ఖాన్ ద‌బాంగ్ 3 సినిమాలో విల‌న్‌గా న‌టించాడు ఈ క‌న్న‌డ స్టార్‌. ఆ స‌మ‌యంలో సల్మాన్‌తో మంచి స్నేహం ఏర్ప‌డింది.

సినిమా విడుద‌లై 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సినిమాను సాధించింది. ఈ సంద‌ర్భంగా కిచ్చాసుదీప్‌ను స‌ల్మాన్‌ఖాన్ ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నాడు. అంతే కాదండోయ్ ఖ‌రీదైన బీఎండ‌బ్ల్యూ కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు స‌ల్మాన్‌. ఈ విషయాన్ని స్వ‌యంగా సుదీప్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ స‌ల్మాన్‌ఖాన్ బ‌హుక‌రించిన ఖ‌రీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్ ద‌బాంగ్ 3 ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కుతుంది. త‌దుప‌రి చిత్రం రాధేను కూడా ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలోనే స‌ల్మాన్ చేస్తున్నాడు. దీని త‌ర్వాత క‌బీర్‌ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడీ కండల వీరుడు.

More News

వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్.. రాజ్యసభకు చిరు!!

ఇదేంటి.. టైటిల్ చూడగానే షాకయ్యారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయ్.

'అల వైకుంఠపురంలో'... బుట్ట బొమ్మ సాంగ్ టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునే ప‌ర్ప‌స్‌ఫుల్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ’సరిలేరు నీకెవ్వరు’ - ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచమయ్యి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

'కలర్ ఫోటో' పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!

హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో.

'పలాస 1978' తెలుగు లో అసురన్ అవుతుంది.. దర్శకుడు మారుతి

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ .