అనుష్కపై స్టార్ హీరో క్రష్.. ఆమెకు ఫిదా అంటూ కామెంట్స్ 

  • IndiaGlitz, [Monday,May 17 2021]

సౌత్ లో అనుష్క లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోలకు ధీటైన ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక బాహుబలి చిత్రంలో అనుష్క నటించిన దేవసేన పాత్రకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

Also Read: అద్భుతం.. మహా శివుడిని క్లిక్ మనిపించిన దేవిశ్రీ

ఆసక్తికరంగా బాహుబలి చిత్రంలో అనుష్క పెర్ఫామెన్స్ కు బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ ఫిదా అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనుష్కపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ లో ఎవరితో నటించాలని ఉంది అని ప్రశ్నించగా.. ఆ లిస్టులో చాలామంది నటులు ఉన్నారు. కానీ ఒకరితో మాత్రం తప్పకుండా నటించాలి. ఆమె మరెవరో కాదు అనుష్క శెట్టి అని రణబీర్ తెలిపాడు.

బాహుబలి చిత్రం తర్వాత ఆమెపై నాకు చిన్నపాటి క్రష్ ఏర్పడింది. ఒకరోజు ఆమెతో తప్పకుండా నటిస్తా అని రణబీర్ ప్రకటించాడు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే రణబీర్ మాజీ ప్రేయసి కత్రినా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. బాహుబలి తర్వాత తాను ప్రభాస్ కు ఫిదా అయ్యానని, అతడితో నటించాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో ఆమె కోరిక నెరవేరబోతోంది.

'వార్' ఫేమ్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ మూవీలో కత్రినా హీరోయిన్ గా నటించబోతున్నట్లు టాక్. ఇదిలా ఉండగా అనుష్క చివరగా నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం తర్వాత అనుష్క మరో ప్రాజెక్టు అంగీకరించలేదు. ఈ గ్యాప్ లో ఆమె పెళ్లిపై రూమర్స్ వస్తున్నాయి.