Telangana BJP:తెలంగాణ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్టార్ హీరో ప్రచారం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. ఈసారి 400 సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అన్ని రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళ సీనియర్ హీరో, బీజేపీ నేత సురేష్ గోపి రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు.
సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ గోపి మాట్లాడుతూ కేంద్రంలో అవసరాన్ని బట్టి ఇద్దరికీ కేంద్రమంత్రి పదవులు కూడా వచ్చేలా చేస్తామన్నారు. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని.. అయితే తాను మాత్రం ఇద్దరూ గెలిచి కేంద్ర మంత్రులు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుచేత కిషన్ రెడ్డిని, ఈటల రాజేందర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టాని పిలుపునిచ్చారు. ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజార్టీ స్థానాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. మెదక్, జహీరాబాద్, హైదరాబాద్ అభ్యర్థులకు మద్దతుగా ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. త్వరలోనే మరోసారి ఇద్దరు నేతలు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన కమలం పార్టీ.. ఈసారి అంతకు రెట్టింపు స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. కాగా నాలుగో విడతలో భాగంగా మే 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com