విజయ్ 'బీస్ట్'లో స్టార్ హీరో కామియో.. ఎవరో తెలుసా..

ఇలయదళపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ లుక్ లో విజయ్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు.

హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే జార్జియాలో తొలి షెడ్యూల్ పూర్తయింది. విజయ్ ఇంట్రడక్షన్ సన్నివేశం, ఫైట్ సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో పూర్తి చేశారు. తాజా సమాచారం మేరకు దర్శకుడు నెల్సన్ ఈ చిత్రం కోసం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ని కలిసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: దర్శకుడికి థ్యాంక్స్ చెప్పిన స్టార్ హీరో మేనేజర్.. ఎందుకో తెలుసా!

బీస్ట్ మూవీలో కీలకమైన అతిథి పాత్రలో నటించేందుకు నెల్సన్ షారుఖ్ ని అడిగారట. షారుఖ్ కూడా ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. షారుఖ్ రోల్ తో బీస్ట్ పై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం. ఇక రెండవ షెడ్యూల్ ని చెన్నైలో ప్లాన్ చేశారు. సెకండ్ షెడ్యూల్ లో ప్రత్యేకంగా నిర్మించిన షాపింగ్ మాల్ సెట్ లో విజయ్, పూజా హెగ్డేలపై మంచి బీటున్న సాంగ్ ని చిత్రీకరిస్తారట.

ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఇక షారుఖ్ ప్రస్తుతం యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో పఠాన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాగానే అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తారు. ఇటీవలే అట్లీ షారుఖ్ కి లుక్ టెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా హీరో విజయ్ తొలిసారి స్ట్రైట్ తెలుగు చిత్రానికి రెడీ అవుతున్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించేందుకు నిర్మాత దిల్ రాజుతో సంప్రదింపులు జరుగుతున్నాయి.