పవన్ మూవీలో స్టార్ డైరెక్టర్ కీలక పాత్ర ?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొకటి ఇలా పవన్ వెంటవెంటనే చిత్రాలకు ఓకె చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సాగర్ చంద్ర దర్శత్వంలో అయ్యప్పన్ కోషియం రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు. అలాగే క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లులో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: సర్ ప్రైజ్ : బాలయ్యకు యువరాజ్ సింగ్ బర్త్ డే విషెష్!
అయ్యప్పన్ కోషియం రీమేక్ మల్టీస్టారర్ చిత్రం. ఇందులో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చకచకా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ కి కోవిడ్ బ్రేక్ వేసింది. కోవిడ్ ప్రభావం తగ్గాక మిగిలిన భాగం షూటింగ్ ఫినిష్ చేయనున్నారు.
తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఇప్పటికే వినాయక్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వినాయక్ రానా పక్కన ఉండే పాత్రలో కనిపిస్తారట.
వినాయక్ గతంలో ఠాగూర్, ఖైదీ నెం 150 లాంటి చిత్రాల్లో తళుక్కున మెరిశారు. అయితే అవి చాలా చిన్న పాత్రలు. తొలిసారి వినాయక్ ప్రాధాన్యత కలిగిన రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com