క్రేజీ విలన్ కూతురితో స్టార్ క్రికెటర్ రొమాన్స్.. మామగారు కూడా బౌల్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
క్రికెటర్స్ తో బాలీవుడ్ భామలు.. ఇది ఎప్పటికి నెవర్ ఎండింగ్ స్టోరీ అనే చెప్పాలి. అప్పటి వివ్ రిచర్డ్స్ కాలం నుంచి ఇప్పటి కుర్ర క్రికెటర్స్ వరకు ఈ తంతు జరుగుతూనే ఉంది. క్రికెట్ స్టార్లు బాలీవుడ్ సుందరీమణుల ప్రేమలో పడడం, డేటింగ్, పెళ్లి లాంటి వ్యవహారాలు ఇప్పుడు చాలా కామన్ గా మారిపోయాయి.
యంగ్ స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాడు. పైగా అందగాడు.. సో లేడీస్ లో ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. ఆ మధ్యన కూడా రాహుల్ ప్రేమ వ్యవహారాల గురించి జోరుగా ప్రచారం జరిగింది. సౌత్ లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ఓ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
కానీ ఆ లవ్ స్టోరీ ముందుకు సాగలేదు. మళ్ళీ రాహుల్ ప్రెష్ గా ప్రేమలో పడ్డట్లు స్పష్టమైన వార్తలు వస్తున్నాయి. రాహుల్ ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ నటుడు, రజనీకాంత్ దర్బార్ చిత్రంలో విలన్ గా నటించిన సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడు.
ఇటీవల రాహుల్, అతియా ఇంగ్లాండ్ లో వెకేషన్స్ లో తిరుగుతున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనితో ఈ వార్త బి టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై సునీల్ శెట్టికి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అతియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే ఉన్నట్లు సునీల్ ధృవీకరించారు. కానీ తెలివిగా రాహుల్ పేరు చెప్పకుండా.. నా కుమార్తె ఇంగ్లాండ్ లోనే ఉంది. నా కొడుకు ఆహాన్ తో కలసి వెళ్ళింది. అక్కా తమ్ముడు వెకేషన్ కి వెళ్లారు. మిగిలిన విషయాలు నాకు తెలియదు అని దాటవేశారు.
కానీ రాహుల్ గురించి ప్రశ్న ఎదురైనప్పుడు.. అతడు మంచి క్రికెటర్.. రాహుల్, అతియా ఇద్దరూ ఓ బ్రాండ్ యాడ్ లో పాల్గొన్నారు. వారిద్దరూ గుడ్ లుకింగ్ కపుల్ అని కాంప్లిమెంట్ ఇచ్చేశాడు ఈ దర్భార్ విలన్. మొత్తానికి రాహుల్.. అతియానే కాదు... మామగారిని కూడా క్లీన్ బౌల్డ్ చేసినట్లు ఉన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments