వరుస ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ .. ఉదయభాను రీఎంట్రీ ఇచ్చేసినట్లేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఉదయభాను.. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరేమో. తనదైన పంచ్‌లు, మాడ్యులేషన్‌తో ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా వెలుగొందారు . సుమ, ఝూన్సీ, శిల్పా చక్రవర్తి వంటి వారు తెలుగు బుల్లితెరను ఏలుతున్న కాలంలో ఉదయభాను సైతం తన మార్క్ చూపించారు. కుటుంబ కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులతో 15 ఏళ్ల వయసులోనే వ్యాఖ్యాతగా అడుగుపెట్టిన ఉదయభాను.. హృదయాంజలి ప్రోగ్రామ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసపెట్టి వన్స్‌మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా, జానవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం గాను వంటి షోలకు హోస్ట్‌గా చేస్తూనే సినిమాలలోనూ అవకాశాలు దక్కించుకున్నారు. అలా శ్రావణ మాసం, ఎర్రసైన్యం, లీడర్, కొండవీటి సింహం వంటి సినిమాల్లో నటించారు. అలాంటి ఉదయభాను ఒక్కసారిగా వెండితెరకు, బుల్లితెరకు ఏకకాలంలో దూరమయ్యారు. పెళ్లి చేసుకుని పిల్లలతో మ్యారేజ్ లైఫ్ ఏంజాయ్ చేస్తున్న ఆమె రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఉదయభాను కనిపించింది. ఈ మధ్యే మళ్లీ చిన్న చిన్న ఈవెంట్స్ లో సందడి చేస్తోంది. కానీ గుర్తు పెట్టుకునే ఈవెంట్ ఒక్కటి కూడా చేయలేదు. ఇటీవల బాలయ్య అఖండ సినిమా సక్సెస్‌తో ఆ చిత్రయూనిట్‌ని ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టి తనపై పడేలా చేసింది ఉదయభాను. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ టీమ్‌తో కూడా చిట్‌చాట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే తిరుపతిలో జరిగిన పుష్ప సినిమా సక్సెస్ మీట్ కూడా ఉదయభానునే హోస్ట్ చేసింది. 40 ప్లస్‌లో వున్నా .. ఆమె అందంలో క్రేజ్‌లో ఏ మాత్రం మార్పు లేదు. వరుస ఈవెంట్లను బట్టి చూస్తుంటే.. ఇప్పటికీ ఉదయభాను సరిగ్గా కాన్సన్‌ట్రేట్ చేస్తే బిజీ అవ్వడం పెద్ద లెక్క కాదంటున్నారు సినీ జనాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com