తెలంగాణ పది పరీక్షల షెడ్యూల్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర హైకోర్టు ఇటీవలే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. జూన్-08 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవలే ఈ పరీక్షల నిర్వహణపై కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు ఫైనల్‌కు పది పరీక్షల నిర్వహణకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో గత కొన్నిరోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడినట్లయ్యింది. ఈ మేరకు టెన్త్ పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉందని హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం శుక్రవారం నాడు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
పరీక్షలన్నీ ఉదయం 9:30 నుంచి మధ్యాహం 12:15 గంటల వరకు జరుగనున్నాయి. హైకోర్టు చెప్పినట్లుగానే ప్రతిపరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్‌ను సర్కార్ రూపొందించింది. మరోవైపు.. ప్రస్తుతమున్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే తెలుగు, హిందీ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంగ్లీష్ పరీక్ష నుంచి షెడ్యూల్‌ను సర్కార్ విడుదల చేసింది. జూన్-08న ప్రారంభమై జులై 05 వరకు పరీక్షలు జరగనున్నాయి.
షెడ్యూల్ ఇదీ.. :-
జూన్ 8వ తేదీ (సోమవారం) ఇంగ్లీష్ మొదటి పేపర్
11వ తేదీ (గురువారం) ఇంగ్లీష్ రెండో పేపర్
14వ తేదీ (ఆదివారం) గణితము మొదటి పేపర్
17వ తేదీ (బుధవారం) గణితము రెండో పేపర్
20వ తేదీ (శనివారం) సామాన్య శాస్త్రం మొదటి పేపర్
23వ తేదీ (మంగళవారం) సామాన్య శాస్త్రం రెండో పేపర్
26వ తేదీ (శుక్రవారం) సాంఘిక శాస్త్రం మొదటి పేపర్
29వ తేదీ (సోమవారం) సాంఘిక శాస్త్రం రెండో పేపర్
జూలై 02వ తేదీ (గురువారం) ఓరియంటల్ మొయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్ (సంస్కృతము, అరబిక్)
జూలై 05వ తేదీ (ఆదివారం) ఓరియంటల్ మొయిన్ లాంగ్వేజ్ రెండో పేపర్ (సంస్కృతము, అరబిక్), ఒకేషనల్ కోర్సు పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments