ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నేటి సాయంత్రం విద్యాశాఖాధికారులతో సమావేశమైన ఆయన కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి చెందిన పదో తరగతి విద్యార్థులనందరినీ పాస్ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో తాజాగా ఏపీ కూడా చేరిపోయింది

విద్యార్థులకు మరో గుడ్ న్యూస్

ఇప్పటికే పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించి ఓ గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖామంత్రి.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

More News

ఇది తాగితే 5 రోజుల్లో కరోనా ఖేల్ ఖతం!

‘కబాసుర కుడినీర్’ గురించి తెలుసా? ఇది తాగితే ఐదు రోజుల్లో కరోనా ఖేల్ ఖతమైపోతుంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు..

మార్పులేం లేవంటున్న ఛార్మి

‘స్క్రిప్టులో మార్పులా అలాంటి దేమీ లేదు. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఫైటర్ బ్లాక్ బస్టర్ స్ర్కిప్ట్.

కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగు పెట్టింది: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయేత కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టిందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

నితిన్ పెళ్లి ప్రీ పోన్ కానుందా?

ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల ప్రజలు ఒక‌చోట చేయ‌డానికి ఇబ్బందిగా మారింది. ప‌దిమందికి పైగా ఎక్క‌డైనా గుమిగూడాలంటే ప్ర‌భుత్వాలు ఒప్పుకోవ‌డం లేదు.

టీడీపీలో జగన్ నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా?

ముఖ్యమంత్రి జగన్ ఒక్కొక్కరిగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి.