ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నేటి సాయంత్రం విద్యాశాఖాధికారులతో సమావేశమైన ఆయన కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి చెందిన పదో తరగతి విద్యార్థులనందరినీ పాస్ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో తాజాగా ఏపీ కూడా చేరిపోయింది
విద్యార్థులకు మరో గుడ్ న్యూస్
ఇప్పటికే పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించి ఓ గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖామంత్రి.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments