జూన్ 8 నుంచి పది పరీక్షలు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. జూన్-08 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కాగా.. టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం నాడు సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు ఫైనల్‌కు పది పరీక్షల నిర్వహణకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో గత కొన్నిరోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడినట్లయ్యింది. ఈ మేరకు టెన్త్ పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉందని హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్‌పై వీడియో కాన్ఫరెన్ ద్వారా విచారణ జరిపింది. అదే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.
ఇలా చేయండి..
జూన్-3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మరుసటిరోజే పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు అదేశించింది. అనంతరం జూన్-8 నుంచి పది పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు తెలిపింది. అంతేకాదు.. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించగా అందుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది ఓకే చెప్పారు. మరీ ముఖ్యంగా.. ఇదివరకున్న పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేయడంతో పాటు.. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments