జూన్ 8 నుంచి పది పరీక్షలు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. జూన్-08 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కాగా.. టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం నాడు సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు ఫైనల్‌కు పది పరీక్షల నిర్వహణకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో గత కొన్నిరోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడినట్లయ్యింది. ఈ మేరకు టెన్త్ పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉందని హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్‌పై వీడియో కాన్ఫరెన్‌ ద్వారా విచారణ జరిపింది. అదే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.

ఇలా చేయండి..

జూన్-3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మరుసటిరోజే  పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు అదేశించింది. అనంతరం జూన్-8 నుంచి పది పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు తెలిపింది. అంతేకాదు.. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించగా అందుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది ఓకే చెప్పారు. మరీ ముఖ్యంగా.. ఇదివరకున్న పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేయడంతో పాటు.. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించింది.

More News

విరాట్ కోహ్లి బ‌యోపిక్‌.. కండీష‌న్ అప్లై

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది. పలు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ వ్య‌క్తుల జీవిత చ‌రిత్ర‌ల‌ను సినిమాల రూపంలో మ‌లుస్తున్నారు.

సినీ ఇండ‌స్ట్రీ గురించి రామ్ ట్వీట్‌

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌లు రంగాల్లో సినీ పరిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాలతో సినీ ప‌రిశ్ర‌మ స్తంభించింది.

టాలీవుడ్‌కు మళ్లీ షాకిచ్చిన కేసీఆర్.. ఆశలు ఆవిరి!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు లాక్ డౌన్‌లు పూర్తవ్వగా.. 4.0 మే-18 నుంచి మే-31వరకు ఉండనుంది.

వైఎస్ జగన్‌.. నేను కలిసే ఉన్నాం.. మాకేం వివాదాల్లేవ్ : కేసీఆర్

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పోతిరెడ్డిపాడు వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై పరోక్షంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కాస్త హెచ్చరిస్తూనే కేసీఆర్ మాట్లాడారు.

కేంద్రం ప్యాకేజీ దరిద్రం.. ఆ ముష్టి మాకొద్దు : కేసీఆర్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కష్ట కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. దీనిపై ఐదు దఫాలుగా పూర్తి వివరాలను