SSC & Inter Exams: ఏపీలో పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

  • IndiaGlitz, [Thursday,December 14 2023]

ఏపీలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి నెలలో పరీక్షలు నిర్వహించబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షా సమయం అని తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు.

ఇక మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకరోజు ఫస్టియర్, మరో రోజు సెకండియర్ పరీక్ష ఉంటుందన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు కలిపి సుమారు 16 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనన్నట్లు బొత్స పేర్కొన్నారు.

More News

Times Now Survey: టైమ్స్‌నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం.. ఫ్యాన్ గాలికి టీడీపీ హుష్‌ కాకి..

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని టైమ్స్‌ నౌ నవజీవన్, ఈటీజీ సర్వేలో తేలింది.

షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు.. వైసీపీకి సీనియర్ నేతలు గుడ్ బై..?

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు వైసీపీ సామాజిక సాధికార యాత్రలు.. ఇటు చంద్రబాబు జిల్లాల పర్యటన, లోకేష్ యువగళం యాత్ర..

Salaar:'సలార్' ఫైర్ ముందు కొట్టుకుపోయిన గుంటూరోడు

దేశంలో ఇప్పుడు ఎక్కడా చూసినా 'సలార్' ఫీవరే కనిపిస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం,

PM Modi:పార్లమెంట్‌లో దాడిపై ప్రధాని మోదీ కీలక భేటీ.. భద్రతా సిబ్బందిపై వేటు..

పార్లమెంట్‌లో బుధవారం జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ కీలక మంత్రులతో

Visakhapatnam:విశాఖలోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్టణంలోని ఇండస్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగదాంబకూడలి సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రిలో