దేవి ప్లేస్ లో థమన్...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో టాప్ స్టార్స్‌కు ముఖ్యంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేస్తుంటారు. ఒకరు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ కాగా మరొకరు ఎస్.ఎస్.థమన్. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముందు ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ను మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు. అయితే అల్రెడి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా దేవిశ్రీ బిజీగా ఉండటంతో యూనిట్ దేవిశ్రీప్రసాద్ స్థానంలో థమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments