ఆమెని కూడా మెచ్చుకున్న థమన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ సంగీత దర్శకుడు థమన్.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జున నటించిన రాజుగారి గది2, హిందీ చిత్రం గోల్ మాల్ ఎగైన్, సాయిధరమ్ జవాన్‌తో పాటు రేపు విడుదల కానున్న శర్వానంద్ మహానుభావుడు చిత్రాలకు థమన్‌నే సంగీత దర్శకుడు. ఇదిలా ఉంటే.. హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న రాజుగారి గది2 ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కి, ట్రైలర్‌కి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కి మంచి పేరు వచ్చింది.
ట్రైలర్ రిలీజ్ విడుదల చేసిన రోజు.. ఈ సినిమాలో సమంత నటన హార్ట్ టచింగ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు థమన్. తాజాగా తన ట్విట్టర్‌లో సమంతకి డబ్బింగ్ చెప్పిన చిన్మయిని ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేశాడు. మొదటి సారి సమంతకి డబ్బింగ్ చెప్పిన ఓ అమ్మాయి గురించి ట్వీట్ చేస్తున్నాను. చిన్మయి.. సమంత పాత్రలో (నీ డబ్బింగ్‌తో) జీవించేశావ్ అంటూ పొగుడుతూ పోస్ట్ చేశాడు. సమంత తొలి చిత్రం ఏమాయ చేసావె నుంచి దాదాపు ఆమె ప్రతి చిత్రానికి చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com