పారితోషికం పెంచిన తమన్?

  • IndiaGlitz, [Monday,February 19 2018]

యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌కు 2018 బాగానే క‌లిసొస్తుంద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలైన చిత్రాల్లో.. చెప్పుకోదగ్గ విజయాలు సాధించినవి నాలుగే నాలుగు. ఆ నాలుగింటిలో రెండు సినిమాలకు తమన్ సంగీత‌మందించారు. ఆ చిత్రాలే భాగమతి', తొలిప్రేమ'. ఇవిగాక గాయత్రి', ఇంటిలిజెంట్' సినిమాలకి కూడా తమన్ సంగీతమందించారు. ఫ‌లితాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఈ నాలుగు సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి.

ఈ నాలుగు చిత్రాలకు మ్యూజిక్ ప‌రంగా మంచి వేరియేష‌న్ చూపించాడు త‌మ‌న్‌. ఆ వైవిధ్యమే.. ఇప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాకి మ్యూజిక్ అందించే అవ‌కాశాన్ని ఇచ్చిందంటున్నారు సినీ విశ్లేష‌కులు. మ‌రీ ముఖ్యంగా 'తొలి ప్రేమ' ఆడియో పెద్ద హిట్ కావ‌డం.. త‌మ‌న్‌కు క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే.. గ‌త కొంత‌కాలంగా రూ. 50 లక్షల పారితోషికం తీసుకుంటున్న త‌మ‌న్‌.. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా కోసం రూ.70 ల‌క్ష‌ల పారితోషికం తీసుకుంటున్న‌ట్లు తెలిసింది. తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చిన త‌మ‌న్.. క్వాలిటీ వ‌ర్క్‌తో రేసులో దూసుకుపోతారేమో చూడాలి.

More News

హాస్యనటడు గుండు హనుమంతరావు కన్నుమూత

గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు ఈరోజు ఉదయం మూడున్నర గంటలకు ఎస్.ఆర్.నగర్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు.

మే నుంచి మొదలవ్వనున్న సాయిధరమ్ తేజ్ - గోపీచంద్ మలినేని ప్రొజెక్ట్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్ లో

'రా.రా...' ప్రీ రిలీజ్ వేడుక

హీరో శ్రీకాంత్ ,నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రా రా' ..

'హైదరాబాద్ లవ్ స్టొరీ' ఫిబ్రవరి 23న రిలీజ్

ఈ వారం విడుదల కానున్న సినిమాలలో ప్రేక్షకులను అలరించే సినిమాగా కనపడుతున్న సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ,

రవితేజ చిత్రానికి మంచి డీల్ కుదిరింది

'రాజా ది గ్రేట్ ' విజయంతో మళ్ళీ ఫాంలోకి వచ్చారు మాస్ మహారాజా రవితేజ.