రెండో స్థానంలో చేరిన తమన్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ సంగీత సంచలనం తమన్.. మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. ఈ ఏడాది వరుస విజయాలతో, వైవిధ్యమైన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఈ స్వరకెరటం. నేపథ్య సంగీతమందించడంలో కూడా దిట్ట అయిన ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఓవర్సీస్లో వన్ మిలియన్ - టాప్ గ్రాసింగ్ తెలుగు ఫిలిమ్స్ క్లబ్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (13 సినిమాలు) మొదటి స్థానంలో ఉండగా.. ఆరు సినిమాలతో తమన్ రెండో స్థానంలో నిలిచారు.
తమన్ స్వరపరచిన చిత్రాల్లో దూకుడు` ($1.563), ఆగడు` ($1.482), రేసుగుర్రం`($1.395), బాద్ షా`($1.279), భాగమతి`($1.099), తొలిప్రేమ`($1.000) వన్ మిలియన్ క్లబ్లో స్థానం సంపాదించుకున్నాయి. 2018లో.. ఇప్పటివరకు తమన్ సంగీత సారధ్యంలో విడుదలైన నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు (భాగమతి`, తొలిప్రేమ`) ఈ క్లబ్లో స్థానం సంపాదించుకోవడం విశేషం. అలాగే అనూప్ రూబెన్స్ 4 సినిమాలతో మూడో స్థానంలో ఉండగా.. మిక్కీ జె.మేయర్, గోపి సుందర్, కీరవాణి చెరో 3 సినిమాలతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com