రెండో స్థానంలో చేరిన తమన్

  • IndiaGlitz, [Monday,February 26 2018]

యువ సంగీత సంచ‌ల‌నం తమన్.. మ‌రోసారి తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. ఈ ఏడాది వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్యమైన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఈ స్వ‌ర‌కెర‌టం. నేపథ్య సంగీతమందించడంలో కూడా దిట్ట అయిన ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ప్ర‌స్తుతం వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ - టాప్ గ్రాసింగ్ తెలుగు ఫిలిమ్స్ క్లబ్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (13 సినిమాలు) మొద‌టి స్థానంలో ఉండ‌గా.. ఆరు సినిమాలతో తమన్ రెండో స్థానంలో నిలిచారు.

తమన్ స్వరపరచిన చిత్రాల్లో దూకుడు' ($1.563), ఆగడు' ($1.482), రేసుగుర్రం'($1.395), బాద్ షా'($1.279), భాగమతి'($1.099), తొలిప్రేమ'($1.000) వన్ మిలియన్ క్లబ్‌లో స్థానం సంపాదించుకున్నాయి. 2018లో.. ఇప్ప‌టివ‌ర‌కు తమన్ సంగీత సారధ్యంలో విడుదలైన నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు (భాగమతి', తొలిప్రేమ') ఈ క్లబ్‌లో స్థానం సంపాదించుకోవడం విశేషం. అలాగే అనూప్ రూబెన్స్ 4 సినిమాలతో మూడో స్థానంలో ఉండగా.. మిక్కీ జె.మేయర్, గోపి సుందర్, కీరవాణి చెరో 3 సినిమాలతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.

More News

శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది - ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం

శ్రీదేవిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు.నా సూపర్ హిట్ సినిమాల్లో ఎక్కువగా హిందీలో రీమేక్ చేసింది బోణీ కపూర్ గారే.

శ్రీదేవి చనిపోలేదు.. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటుంది - చిరంజీవి

శ్రీదేవి గురించి ఇలాంటి ఒక సందర్భం వస్తుందని అనుకోలేదు.ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నిజంగా నేనెప్పుడూ ఊహించలేదు.

అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూత

తనదైన అద్భుత నటనతో సినీ వినీలాకాశాన్ని ఏలిన నటి శ్రీదేవి(54)హఠాన్మరణం చెందారు.

నాటి 'శ్రీనివాస కళ్యాణం' బాటలోనే..

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మరపురాని చిత్రాలలో ‘శ్రీనివాస కళ్యాణం’(1987)ఒకటి.

మార్చి 2 నుండి థియేటర్స్ బంద్ కు మేము మద్ధతు ప్రకటిస్తున్నాం - టిఎఫ్ఎఫ్ సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్

నిర్మాతలకు...డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ క్యూబ్,యుఎఫ్ ఓ,పిఎక్స్ డి సంస్థలకు మధ్య శుక్రవారం బెంగుళూరులో