'సైరా' గురించి క్లారిటీ ఇచ్చిన థమన్

  • IndiaGlitz, [Friday,December 01 2017]

'ఖైదీ నెం.150' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి'. చిరు 151వ చిత్రంగా 'సైరా' రూపుదిద్దుకుంటోంది. ఇదిలా ఉంటే.. కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమాకి సంగీతాన్ని అందివ్వలేనని చెప్తూ.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.రెహ్మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ సినిమాకి ఎవ‌రు సంగీత‌మందించ‌నున్నారు అనేది హాట్ టాపిక్ అయ్యింది.

ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌ మోషన్ పోస్టర్ కి నేప‌థ్య సంగీతం అందించిన థ‌మ‌న్‌నే సంగీత‌మందించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలు వినిపించాయి. అయితే.. ఈ విషయమై రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో థమన్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించమని ఇంతవరకు తనని ఎవరూ సంప్రదించలేదని, ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా మీడియాకు తెలియజేస్తానని చెప్పాడు. ఈ నెల 6 నుంచి రెగ్యుల‌ర్‌ షూటింగ్ మొదలు కావాల్సిన తరుణంలో.. మెగా కాంపౌండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.