'కుంభస్థలాన్నే కొడదాం పదా '.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ హైబడ్జెట్ చిత్రం కోసం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ‘‘ఆర్ఆర్ఆర్’’ ట్రైలర్‌ను ప్రదర్శించారు. సాయంత్రం యూట్యూబ్‌లో దీనిని విడుదల చేస్తారు.
ఇక థియేటర్స్‌లో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసి అభిమానుల కేరింతలు మామూలుగా లేవు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలలో ఒదిగిపోయి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు హై-డోస్ ఎమోషన్స్ కూడా ఉంటాయనే విషయాన్ని యూనిట్ ఎప్పటి నుంచో చెబుతోంది. అది ట్రైలర్లో ఎక్కువగా కనిపించింది. ఎంట్రీ లోనే పులితో ఎన్టీఆర్ తలపడే సీన్ రోమాలు నిక్కపొడిచేలా వుంది.
బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన కోమరం భీంని నిలువరించే సరైన పోలీస్ అధికారి కోసం ప్రభుత్వం వెతుకుతూ వుంటుంది. అప్పుడు చరణ్‌ని రంగంలోకి దింపుతారు. దీంతో కొమురం భీం-రామ్ చరణ్‌ల మధ్య వార్ మొదలవుతుంది. అయితే బ్రిటీష్ వారి అరాచకాలకు రామ్‌లో సంఘర్షణ మొదలై.. కొమురం భీంతో చేతులు కలుపుతారు. ఎమోషనల్ సీన్లతో పాటు వార్ సీక్వెన్స్‌లు హైలెవల్లో వున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. చివరిలో ‘‘ఇలా ఎందుకు భీం.. ఏకంగా కుంభస్థలాన్నే కొడదాం పదా ’’ అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. శ్రీయా, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్‌లు సైతం తమ పరిధిలో జీవించారనే చెప్పవచ్చు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ‘‘ఆర్ఆర్ఆర్’’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా సిద్ధమవుతోందని అంచనా. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్నారు. తారక్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com