వివాదంపై రాజమౌళి మాట్లాడాడు
- IndiaGlitz, [Monday,April 17 2017]
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ 'బాహుబలి 2' ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సినిమా సందర్భంగా సినిమా యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అయితే ఇందులో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ కావేరీ జలాల విషయంలో కన్నడ ప్రజలను కించపరిచేలా మాట్లాడరని కన్నడ చలవలి వటల్ అధ్యక్షుడు నాగరాజ్ పెర్కొడనడంతో బాహుబలి 2 విడుదల కర్ణాటకలో జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది.
అయితే దీనిపై రాజమౌళి స్పందించారు. ఐదేళ్లు సత్యరాజ్‌తో పనిచేశాను. ఆయన ఇతరులను బాధ పెట్టే వ్యక్తికారని తెలిసింది. సత్యరాజ్‌గారు తొమ్మిదేళ్ళ క్రితం మాట్లాడిన వ్యాఖ్యలను ఇప్పుడు తెరపైకి తెచ్చి దుమారం రేపడం మంచిదికాదు అని రాజమౌళి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.