రాజమౌళి రిక్వెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలిలో రెండో భాగం `బాహుబలి 2` విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 28న విడుదలవుతున్న ఈ సినిమాలో సత్యరాజ్ వల్ల ఇప్పుడు కర్ణాటకలో బాహుబలి 2 విడుదలకు సమస్య క్రియేట్ అయ్యింది. కావేరీ జలాలపై సత్యరాజ్ తొమ్మిదేళ్ళ క్రితం చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు బాహుబలి 2 విడుదలకు ఆటంకమయ్యాయి. సత్యరాజ్ క్షమాపణ చెప్పకుంటే బాహుబలి2ని విడుదల కానివ్వమని, ఏప్రిల్ 28న కర్ణాటక బంద్ చేస్తున్నట్లు కన్నడిగులు తెలిపారు.
అయితే సమస్యను జటిలం చేయడం ఇష్టం లేని దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా కర్ణాటక ప్రజలను రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఎప్పుడో తొమ్మిదేళ్ళ క్రితం సత్యరాజ్ చేసిన కామెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని బాహుబలి 2కు ఆటంకం కలిగించొద్దు. వివాదస్పద వ్యాఖ్యలు తర్వాత సత్యరాజ్ నటించిన ఎన్నో సినిమాలు కర్ణాటకలో విడుదలయ్యాయి. కాగా, బాహుబలిలో నటించిన ఎందరో నటీనటుల్లో సత్యరాజ్ ఒకరు. బాహుబలి 2ను అడ్డుకోవడం వల్ల సత్యరాజ్‌కు ఏ నష్టం లేదు. నిర్మాతలకే నష్టం కాబట్టి బాహుబలి 2ను విడుదల కానివ్వమని విన్నవించుకున్నారు. మరిప్పుడు కన్నడిగులు రాజమౌళి రిక్వెస్ట్‌ను మన్నిస్తారంటారా..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com