సీక్వెల్ ఆలోచనలో రాజమౌళి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఐదేళ్ళ పాటు బాహుబలితో బిజీగా మారిపోయిన ఎస్.ఎస్.రాజమౌళి, ఇప్పుడు బాహుబలి రెండో పార్ట్ `బాహుబలి-2` సక్సెస్‌ను, ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన తదుపరి సినిమా ఏం చేస్తాననే దానిపై రాజమౌళి ఇంకా క్లారిటి ఇవ్వలేదు.
అయితే బాహుబలి రేంజ్లో కాకుండా సింపుల్‌గానే సినిమా చేయాలనుకుంటున్నానని రాజమౌళి చెప్పినా, ఇండస్ట్రీలో మాత్రం రాజమౌళి తదుపరిగా ఈగ సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఇందులో అయితే హీరో డేట్స్‌కు పెద్ద స్కోప్ ఉండదు. సినిమాను కూడా టెక్నికల్‌గా తెరకెక్కించవచ్చునని రాజమౌళి ఆలోచన అంటున్నారు. మరి ప్రస్తుతం సమ్మర్ హాలీడేను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తదుపరి సినిమా ఏది చేస్తాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com