ఆర్ ఆర్ ఆర్‌కి షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్‌

  • IndiaGlitz, [Monday,October 22 2018]

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి 'బాహుబ‌లి' త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌బోయే ఈ సినిమాకు సంబంధించిన వ‌ర్క్‌షాప్ నిర్వ‌హిస్తున్నాడ‌ట రాజ‌మౌళి. గ‌తంలో బాహుబ‌లి సినిమాకు ముందు కూడా రాజ‌మౌళి వ‌ర్క్‌షాప్ నిర్వహించాడు. ఇప్పుడు అదే స్ట‌యిల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కూడా వ‌ర్క్ షాప్ నిర్వ‌హిస్తున్నాడు.

ఎందుకంటే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను నవంబ‌ర్ 18 నుండి స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. అంత‌కు ముందే చిన్న పాటి వ‌ర్క్‌షాప్ ఉంటుంద‌ని అంటున్నారు. నవంబ‌ర్ 18 నుండి డిసెంబ‌ర్ 18 వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ సైతం బోయపాటి చిత్రానికి గ్యాప్ తీసుకుని ఈ షెడ్యూల్‌లో పాల్గొన‌బోతున్నాడ‌ట‌. ఈ చిత్రం 2020లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.