స్వాతంత్ర్యోద్యమం నేపథ్యంలో రాజ‌మౌళి మల్టీస్టారర్ మూవీ?

  • IndiaGlitz, [Sunday,April 08 2018]

'బాహుబలి' సిరీస్‌తో తన దర్శకత్వప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అబ్బురపరిచారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన నుంచి వచ్చే తదుపరి చిత్రం ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. వారి ఆసక్తికి తగ్గట్టుగానే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించి.. ఈ మూవీపై అంచనాలను పెంచుతున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి కథను రూపొందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అంతేకాకుండా.. స్వాతంత్ర్యోద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే.. గతాన్ని, ప్రస్తుతాన్ని మిళితం చేసి చిత్రంలో చూపించబోతున్నారట దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే స్వాతంత్ర్యోద్యమం ఘట్టానికి సంబంధించి ఆంగ్ల నటీనటులను కూడా సంప్రదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఏడాదిన్నరకు పైగా చిత్రీకరణ జరుపుకోబోయే ఈ చిత్రం దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంద‌ని స‌మాచారం. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా.. సినిమాని 2020 వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

More News

త‌మ‌న్నా ఐపీఎల్ పారితోషికం ఎంతంటే...

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఐపీఎల్‌లో ఆడి పాడ‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభ వేడుక‌ల‌ను నిర్వాహ‌కులు ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు.

వైస్సార్ పాత్రలో మమ్మూట్టి 'యాత్ర' మెద‌టి లుక్ విడుద‌ల‌

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజి ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డాక్ట‌ర్‌. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ ని వ‌రుసగా భ‌లేమంచి రోజు

పోలీస్ క‌స్ట‌డీలో శ్రీ రెడ్డి...

కాస్టింగ్ కౌచ్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి టాలీవుడ్‌లో దుమారాన్ని రేపిన న‌టి శ్రీరెడ్డి.. రోజుకో సంచ‌ల‌నానికి తెర తీస్తుంది.

నో చెప్పేసిన కాజ‌ల్‌...

ఎవైరెనా డబుల్ రెమ్యునరేషన్ ఇస్తే సినిమాలు వద్దనుకుంటారా! ఎగిరి గంతేసి చేయుడానికి రెడీ అవుతారు. కానీ కాజల్ అగర్వాల్ అలా చేయలేదు.

 వైజాగ్‌ ఆర్ కె బీచ్ లో నా పేరు సూర్య సైకత శిల్పం

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  మే 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'.