టార్గెట్ ఫిక్స్ చేసిన రాజమౌళి
Send us your feedback to audioarticles@vaarta.com
విజయాలకి కేరాఫ్ అడ్రస్ ఎస్.ఎస్.రాజమౌళి. విజయమే రాజమౌళి..రాజమౌళియే విజయం..అన్నట్టుగా ఎదిగారు ఈ దర్శకధీరుడు. 'బాహుబలి' సిరీస్ తర్వాత ఎటువంటి సినిమాని తెరకెక్కిస్తారోనని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మల్టీస్టారర్ మూవీ చేస్తున్నట్టు క్లూ ఇచ్చారు రాజమౌళి. అయితే తన సినిమా కోసం నటీనటులతో పాటు చిత్ర యూనిట్‌ను కూడా పరుగులు పెట్టించే రాజమౌళి.. ఇప్పుడు పరోక్షంగా ఇద్దరు స్టార్ డైరెక్టర్లను కూడా పరుగులు పెట్టిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు కథానాయకుడు రామ్ చరణ్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే..ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రం కూడా మార్చి 23 నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాల విషయమై రాజమౌళి ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లని పరుగులు పెట్టిస్తున్నారని సమాచారం.
ఇందులో పరుగులు పెట్టించడానికి ఏముందనుకుంటున్నారా?..ఈ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రాల్లో నటిస్తున్న హీరోలతో.. రాజమౌళి మల్టీస్టారర్ మూవీ రూపొందించడమే ఈ పరుగులలోనే ఆంతర్యం. రాజమౌళి చిత్రం అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. కాని అంతకంటే ముందు అంటే ఆగష్టు నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను తనకు అందుబాటులో ఉండమని చెప్పారట.
రాజమౌళి మాటని జవదాటని ఈ ఇద్దరు హీరోలు.. ఇప్పుడు వారి వారి చిత్రాలు జూలై నెలాఖరు కల్లా పూర్తి చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే బోయపాటి, త్రివిక్రమ్ సినిమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై కల్లా పూర్తిచేసే పనిలో ఉన్నారని పరిశ్రమలో కథనాలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments