ఛాలెంజ్ స్వీక‌రించిన రాజ‌మౌళి.. స‌వాలు కూడా విసిరాడు...

  • IndiaGlitz, [Wednesday,July 25 2018]

ఒక్కొక్క‌సారి ఒక్కొక్క ఛాలెంజ్ ట్రెండ్ అవుతుంటుంది. ఇంత‌కు ముందు.. ఫిట్‌నెస్ చాలెంజ్ వైర‌ల్ అయ్యింది. అంద‌రూ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తూ.. చాలెంజ్‌లు విసురుతూ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న హ‌రిత‌హారం కోసం ప్ర‌ముఖులు చాలెంజ్ చేస్తూ మ‌ద్ద‌తు విసురుతున్నారు.

తెలంగాణ ఎం.పి. క‌ల్వ‌కుంట్ల క‌విత విసిరిన చాలెంజ్‌ను రాజ‌మౌళి స్వీక‌రించి మొక్క‌లు నాటారు. 'క‌విత‌గారు నేను మ‌ర్రిచెట్టు, గుల్మోహ‌ర్‌, వేప మొక్క‌ల‌ను నాటాను. పుల్లెల గోపీచంద్‌, కె.టి,ఆర్, సందీప్ వంగా, నాగ్ అశ్విన్‌ల‌కు హ‌రిత‌హారం చాలెంజ్ విసురుతున్నాను' అంటూ చాలెంజ్ చేశారు. మ‌రి వీరెలా స్పందిస్తారో చూడాలి.