ఎన్టీఆర్ తో సినిమా గురించి రాజమౌళి...
Monday, May 29, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి తర్వాత రాజమౌళి క్రేజ్ ఎవరెస్టును తాకింది. రాజమౌళితో నేనంటే నేను సినిమాలు చేస్తానంటూ స్టార్ హీరోలందరూ క్యూ కడుతున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ ఏదనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందా అని ప్రశ్నిస్తే మాత్రం..తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని, తన తదుపరి సినిమా ఎన్టీఆర్‌తో ఉండవచ్చు లేకపోవచ్చునని అన్న రాజమౌళి.
తాను కథ అంతా ఓకే అనుకున్న తర్వాతే హీరో గురించి నిర్ణయం తీసుకుంటానని కూడా అన్నాడు. అంతే కాకుండా తండ్రి విజయేంద్రప్రసాద్ తనకు ఇప్పటి వరకు మూడు కథలు వినిపించాడని, అయితే అవి తనకు నచ్చలేదని అన్నాడు. తనకు కె.ఎల్.నారాయణ, డి.వి.వి.దానయ్యల, సాయి కొర్రపాటిలతో సినిమాలు చేయాల్సిన కమిట్ ఉందని ఈ సందర్భంగా రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే తన తదుపరి సినిమా విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌ను రాజమౌళి విప్పలేదు. మరి రాజమౌళి తదుపరి సినిమా ఎవరితోనో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments