బడ్జెట్ పెట్టే ప్రతి సినిమా పేన్ ఇండియా సినిమా కాదు - రాజమౌళి
- IndiaGlitz, [Monday,December 10 2018]
బడ్జెట్ పెట్టిన ప్రతి సినిమా పేన్ ఇండియా సినిమా అయిపోదు. ఓ రీజన్‌కు కట్టుబడకుండా.. అందరికీ నచ్చే కథాంశం ఉంటేనే పేన్ ఇండియా సినిమా అవుతుంది అని అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి. 'కె.జి.యఫ్'ను చూసినప్పుడు పేన్ ఇండియా సినిమా అవుతుందనిపించింది. వెంటనే అనిల్ టాండన్‌కు ఫోన్ చేసి సపోర్ట్ చేయమని చెప్పాను అని అన్నారు రాజమౌళి.
మంచి విజువల్స్ రావాలంటే డబ్బులు పెడితేనో.. హీరో డేట్స్ ఇస్తేనో రావు. కంప్లీట్ టీం ఎఫర్ట్ ఉండాలి. అంత మంచి టీం దొరికింది కాబట్టే సినిమా బాగా వచ్చింది. సినిమా నచ్చితే ఏ భాష సినిమా.. ఎవరు చేశారు అని ఆలోచించకుండా ఆదరించే ప్రేక్షకులు తెలుగువాళ్లు మాత్రమే. ఆ విషయంలో నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. ట్రైలర్లో ఉన్నట్లు గొప్ప విజువల్స్‌లో సినిమా బావుంది. తప్పకుండా సినిమా తెలుగులోనే కాదు.. ఇండియా అంతటా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అన్నారు రాజమౌళి.
కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకుడు.